సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్ సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. థానేకి చెందిన ఫాతిమా ఖాన్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు విచారణలో తేలింది. By Kusuma 04 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ముంబాయి పోలీసులకు బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఓ మహిళలను అరెస్టు చేశారు. థానేకి చెందిన ఫాతిమా ఖాన్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ పోలీసులు కంట్రోల్ రూమ్‌కు మెయిల్స్ చేసింది. ఇది కూడా చూడండి: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి! మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల.. ఫాతిమా ఖాన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమెని పోలీసులు అరెస్టు చేయకుండా నోటీసులు జారీ చేశారు. ఫాతిమా మానసిక పరిస్థితి ఎలా ఉందో అని ప్రస్తుతం మెడికల్ చెకప్ చేస్తున్నారు. అందుకే ఆమెను అరెస్ట్ చేయలేదు. ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా ఇదిలా ఉండగా.. బాబా సిద్ధిఖీలా యూపీ సీఎంని కూడా చంపుతామని ముంబాయి పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లో వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి దర్యాప్తు చేస్తూ యువతిని గుర్తించారు. ఇది కూడా చూడండి: నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే? మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీని మూడు రౌండ్లు తుపాకీలతో కాల్చడంతో మరణించారు. సల్మాన్ ఖాన్‌తో సిద్దిఖీ సన్నిహితంగా ఉండటం వల్ల బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితం ఎవరు ఉన్నా కూడా వారిని చంపేస్తామని తెలిపింది. అయితే సిద్దిఖీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు. అయిన కూడా హత్యకు గురయ్యారు. ఇది కూడా చూడండి: విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని.. #cm-yogi-adityanath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి