Viral News: ఆరడుగుల బస్సులో ఏడడుగుల తెలంగాణ అందగాడు..

అమీన్‌ అహ్మద్‌ అన్సారీ హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 7అడుగుల పొడవు ఉంటాడు. దీంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. ఆరడుగుల ఎత్తుండే బస్సులో ఏడడుగులున్న తాను మెడనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు.

New Update
7 feet man working as a bus conductor

7 feet man working as a bus conductor

సాధారణంగా మనుషుల ఎత్తు, బరువుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది.  కొంతమంది చూడ్డానికి చాలా పొట్టిగా ఉంటారు. మరికొందరు చూస్తే ఏకంగా ఆజానుభావుడిలా కనిపిస్తారు. ఏడెనిమిది అడుగుల ఎత్తుతో కనిపించి అందరి చూపు తమ వైపుకు తిప్పుకుంటారు. కానీ ఆ ఎత్తు కారణంగా వారు ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటారు. 

Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

అవును.. ఎత్తుగా ఉండేవారు చిన్న చిన్న ప్రదేశాలలో చాలా ఇబ్బంది పడతారు. వారు వాహనాలలో ప్రయాణించలేరు. చిన్న చిన్న ఇళ్లలో ఉండలేరు. ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. దాదాపు ఏడు అడుగులు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి.. కండక్టర్‌ జాబ్ చేస్తూ ఎన్నో ఇబ్బందులతో సఫర్ అవుతున్నాడు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

6అడుగుల బస్సు.. 7 అడుగుల కండక్టర్

అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్‌లోని చంద్రాయణ్ గుట్టలోని షాహీనగర్‌లో నివాసముంటున్నాడు. అతడి తండ్రి ఒక హెడ్ కానిస్టేబుల్. కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు. అనారోగ్యంతో ఆయన 2021లో మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి కండక్టర్‌గా జాబ్ వచ్చింది. 

Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

అతడికి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అయితే అన్సారీ దాదాపు ఏడడుగుల పొడవు ఉండటంతో బస్సులో కండక్టర్ విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. బస్సుల్లో ప్రతి రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గం.ల వరకు ప్రయాణించడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల ఏడడుగుల పొడవున్న అన్సారీ గంటల తరబడి తల వంచి ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో తాను తీవ్ర మెడ నొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్‌ చుట్టూ తిరగాల్సి వస్తోందని అమీన్ అహ్మద్ అన్సారీ ఆవేదన చెందుతున్నాడు. అతడి సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి అమీన్ అహ్మద్ అన్సారీకి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

(viral-news | viral-photo | latest-telugu-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు