Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

New Update
hyd

Ap: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్  పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: US: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్

ఇవాళ నెల్లూరు, తిరుపతి,అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుపతి, సూళ్లూరుపేట వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. 

Also Read: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

ఘాట్ రోడ్లు, కొండచరియలున్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Also Read: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

రెండు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వానలతో స్వర్ణముఖి, కాళింగి నదులతో పాటు పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

Also Read: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

తిరుమలలో వానపడుతుండడంతో  శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. గాలుల దెబ్బకు చలి తీవ్రత కనిపించింది. చాలా మంది దర్శనం పూర్తికాగానే తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. కొందరు మాత్రం గదులకే పరిమితయ్యారు. తిరుమలలోని జలాశయాల్లో భారీగా నీరు చేరింది. మరోవైపు ఏపీలోని మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. 

ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తోంది. ఏజెన్సీలో ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు కమ్మేస్తుంది. చలి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు