Crime News : సంగారెడ్డి తెల్లాపూర్‌లో కలకలం..తల్లి,కొడుకు దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో తల్లి, కుమారుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

New Update
murder

murder

Crime News :సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో తల్లి, కుమారుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. పోలీసుల కథనం ప్రకారం నారాయణపేట జిల్లా కర్ని గ్రామానికి చెందిన శివ, వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన చంద్రకళ ఆమె కుమారుడు రేవంత్‌ నాలుగు రోజుల క్రితం తెల్లాపూర్ జేపీ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. శివ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వారు చూసేసరికి చంద్రకళ, రేవంత్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. శివ తీవ్ర గాయాలతో ఉండగా  పోలీసులు అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గణేశ్‌ పటేల్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు