MandaKrishna Madiga : అప్పటివరకు పరీక్షల ఫలితాలు ఆపాల్సిందే..మందకృష్ణ సీరియస్‌

తెలంగాణలో గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. అయితే దీనిపై ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్‌ అయ్యారు.

New Update
Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga : తెలంగాణలో గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది.అయితే దీనిపై ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్‌ అయ్యారు.ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ఫలితాలను గతంలోనే విడుదల చేయాల్సి ఉండే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈరోజుతో కోడ్‌ ముగియడంతో గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. రేపు గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంక్ కార్డులను విడుదల చేయనుంది.

Also Read :  రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?
 
పరీక్షల ఫలితాల విడుదల చేయడాన్ని మందకృష్ణ తప్పుబట్టారు.ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం రూపొందించారని తెలిపారు. ఆ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4వ నిబంధనను పొందుపరిచారని చెప్పారు. ఆ చట్టాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. గతంలో ఇచ్చిన నోటిషికేషన్‌లో వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చూపెట్టిన నిజాయితీని రేవంత్‌రెడ్డి చూపెడితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. వర్గీకరణ వ్యతిరేక తీర్పును వేగంగా అమలు చేశారని, వర్గీకరణ అమలు తీర్పును అమలు చేయడానికి కొర్రీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని గుర్తుచేశారు.

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

ఓ వైపు ఎస్సీ వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే.. మరోవైపు చట్టం రాకముందే ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని అన్నారు. గ్రూప్‌ 1, 2, 3, హాస్టల్ వార్డెన్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్ తదితర అన్ని ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీక్షలు కొనసాగుతున్నాయని తర్వాత శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని అన్నారు. తహశీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడిలు చేపడతామని ఆయన తెలిపారు.

Also Read :   Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. హాజరైన సీఎం రేవంత్‌

Also read :  చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు