Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. హాజరైన సీఎం రేవంత్‌

ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. 

New Update
Congress MLC candidates

Congress MLC candidates

Congress:ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఇతర మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. 

Also Read :  ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు 4, బీఆర్‌ఎస్‌కు ఒకటి దక్కనున్నాయి. తమకు వచ్చే నాలుగులో ఒక సీటును మిత్రపక్షం అయిన సీపీఐకి కేటాయించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్‌ సీపీఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది. కాగా సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ నేత నెల్లికంటి సత్యం కు కేటాయించింది.కాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీ సీటు కేటాయించింది.

Also Read :  ప్రేయసితో స్టేడియంలో చాహల్.. నెట్టింట వీడియో వైరల్

ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల విషయంలో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులలో ఒక అద్దంకి దయాకర్‌ తప్ప మరో ఇద్దరి ఎంపికను ఎవరూ ఊహించలేదు.ఎట్టకేలకు తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళ అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. అయితే ఊహించని విధంగా విజయశాంతి పేరు తెర పైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంఛార్జి థాక్రె హామీ ఇచ్చిన నేపథ్యంలోనే విజయశాంతికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఎమ్మెల్సీ సీటు మళ్లీ తెరపైకి వచ్చారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్‌తో అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాకుండా.. పార్టీకి చాలా రోజులుగా విధేయంగా ఉన్నవారికి, కీలక వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది

Also Read :  రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు

గత కొన్ని రోజుల నుంచి పలువురి సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే లాస్ట్ మినిట్ లో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి రావడం ఎవరూ ఊహించలేదు. బీజేపీ లో ఎలాంటి ఐడెంటిటీ రాలేదన్న బెంగతో అసెంబ్లీ ఎన్నికల ముందు విజయశాంతి హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో చేరే సమయంలో ఆమెకు సముచిత స్థానం ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.  ఇక నామినేషన్‌ వేసిన తర్వాత ముగ్గురు అభ్యర్థులు కూడా శాసనసభ భవనం లోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ను, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిని, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

Also Read :  ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

Also Read: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు