Kishan Reddy: సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు

సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

New Update
Kishan Reddy

సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణంపై వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(union-minister-kishan-reddy) స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి కాలరీస్ ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు సింగరేణి సంస్థని రాజకీయ ప్రయోగశాలగా వాడుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. నైనీ బ్లాక్‌తోపాటు పూర్తిగా ప్రక్షాళణ చేస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల విభేదాలతో సింగరేణి అంశం బయటకు వచ్చిందని ఆయన చెప్పారు.

Also Read :  గుంపు మేస్ట్రీ.. గుంటనక్క ఒక్కటే..తెలంగాణ జాగృతి కవిత సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy Wants CBI Probe Into Singareni Irregularities

భారతదేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి(kishan reddy speech) కొనియాడారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, దేశ పారిశ్రామిక వృద్ధిలో ఈ సంస్థ భాగస్వామ్యం వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు పోషించిన చైతన్యవంతమైన పాత్రను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఒకప్పుడు భారీ లాభాలతో వెలిగిపోయిన సింగరేణి(singareni), తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా ఇబ్బందుల్లోకి నెట్టబడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక, నిర్వహణ పరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థ ఉనికికే ముప్పు వాటిల్లుతోందని విమర్శించారు. సింగరేణి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితం కాదని, ఇందులో 51 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానిది కాగా, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది అని ఆయన గుర్తు చేశారు. సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ముఖ్యంగా ఒడిశాలోని 'నైని' వంటి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపులో కేంద్రం చొరవ తీసుకుంటోందని తెలిపారు.

Also Read :  నేడు మేడారంలో మండె మెలిగే పండుగ.. ఈ రోజు ఏం చేస్తారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు