Medaram : నేడు మేడారంలో మండె మెలిగే పండుగ..ఈ రోజు ఏం చేస్తారో తెలుసా?

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది. మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే (శుద్ధి) పండుగ గత బుధవారం ఘనంగా జరుగగా ఈ రోజు మేడారంలోని సమ్మక్క,-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు.

New Update
FotoJet - 2026-01-21T094513.216

Today is the Mande Melige festival

Medaram : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది. మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే (శుద్ధి) పండుగ గత బుధవారం ఘనంగా జరుగగా ఈ రోజు మేడారంలోని సమ్మక్క,-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి మెలిగే పండగను నిర్వహించారు. ఈ బుధవారం మండె మెలిగే పండుగ నిర్వహిస్తారు.సమ్మక్క గుడిలో పూజారులు కొక్కర కృష్ణయ్య, సిద్దమైన మునీందర్‌‌ ఆధ్వర్యంలో, కన్నేపల్లి సారలమ్మ గుడిలో కాక సారయ్య ఆధ్వర్యంలో గుడి మెలిగే పండుగను నిర్వహించారు. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా ఈ గుడి మెలిగే పండుగను నిర్వహిస్తామని పూజారులు తెలిపారు. కాగా సమ్మక్క పూజా మందిరంలో సిద్దబోయిన వంశస్తులు, సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు పండుగను వైభవంగా నిర్వహించనున్నారు. మొదట తల్లుల గద్దెల వద్దకు వెళ్లి పూజారులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్‌ ఇంటికి చేరుకుని అక్కడి నుంచి పసుపు, కుంకుమ, మామిడి తోరణాలతో తరలివచ్చి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ప్రధాన రహదారులకు బూరుగు చెట్టు కర్రలతో ధ్వజ స్తంభాలకు మామిడి తోరణాలు, కోడి పిల్లలను కట్టి కట్టడి ఏర్పాటు చేస్తారు. సమ్మక్క పూజా మందిరానికి చేరుకుని తల్లి గద్దె, గుడిని శుద్ధి చేస్తారు.

సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కిరణ్‌ భద్రపరిచిన పూజా సామగ్రిని (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఈత కొమ్ములు)శుద్ధి చేసి తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. దూప, దీప నైవేద్యం సమర్పించి అమ్మవార్ల మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు సంకేతాలు ఇస్తారు. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని తల్లిని గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ మండె మెలిగే పండుగతో ప్రారంభమైన పూజలు మహాజాతర ముగిసిన అనంతరం వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగ వరకు కొనసాగుతాయి. పూజల అనంతరం గద్దెల వద్దకు కన్నెపల్లి నుంచి సారక్క పూజారులు బయలుదేరి వచ్చి సిద్దబోయిన, కాక వంశీయులు ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. రాత్రంతా పూజలు నిర్వహిస్తూ జాగరణ చేస్తారు. వేకువజామున సమ్మక్క-సారలమ్మ పూజా మందిరాల వద్దకు చేరుకుని తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు కాళ్లకు చెప్పులు లేకుండా పదిహేను రోజులపాటు అత్యంత నియమ నిష్టలు పాటిస్తారు. 

Advertisment
తాజా కథనాలు