/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)
Virat Kohli
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 111 బంతుల్లో ఏడు ఫోర్లతో 100* చేసి నాటౌట్ గా మిగిలాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో విరాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
చాలా తృప్తినిచ్చింది..
కీలక మ్యాచ్ లో రాణించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు కింగ్ కోహ్లీ. ఎక్కువ రిస్క్ లు తీసుకోకుండా...మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను అడ్డుకోగలిగితే చాలు అనుకున్నా..అందుకే తగ్గట్టే ఆడా అని చెప్పాడు. ఆ ఊపులో కొన్ని బౌండరీలను కూడా రాబట్టాను. దీంతో నా ఒరిజినల్ ఆట బయటకు వచ్చిందని విరాట్ అన్నాడు. బయటి శబ్దాలతో సంబంధం లేకుండా నా శక్తిని, ఆలోచనలను పూర్తి అదుపులో ఉంచుకున్నా. ఎక్కువ సేపు క్రీజులో ఉండి టీమ్‌కి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ప్రతీ బంతి ఆడాలని..రన్ సాధించాలని అనుకున్నా...లాగే చేశా. పేస్ బౌలింగ్ లో ఎక్కువ పరుగులు చేసేస్తే...తరువాత స్పిన్నర్లు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. ఈ సూత్రాన్నే మ్యాచ్ మొత్తం పాటించా. మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. అలాగే శ్రేయస్ కూడా నాలుగో స్థానంలో వచ్చి మెరుపులు మెరిపించాడు. దీంతో అవతలి ఎండ్ లో కూడా నాకు సపోర్ట్ లభించింది. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ ఆడా. ఇది నాకు ఎంతో తృప్తిని ఇచ్చిందని కోహ్లీ చెప్పాడు. 36 ఏళ్ళ వయసులో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం గొప్పగా అనిపిస్తోందని అన్నాడు రన్ మెషీన్.
Also Read: Virat Kohli: అన్ బీటబుల్ విరాట్..కింగ్ ఆఫ్ క్రికెట్