Telangana BC CM: తెలంగాణకు బీసీ సీఎం.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!

బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు.

New Update
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ (TPCC) మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయన్నారు. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు.
ఇది కూడా చదవండి: TG New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం..

తెలంగాణలో బీసీ కుల గణనపై ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి.. ఇందుకు చట్టబద్దత తీసుకువస్తామన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ కుల గణన ఎందుకు చేయలేదన్నారు. తాము తీసుకువచ్చిన చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసే బాధ్యతను బండి సంజయ్ తీసుకోవాలన్నారు. 
ఇది కూడా చదవండి: Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి నడుం బిగిస్తే ఏ మీడియా పనికి రాదన్నారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఏం చేసింది.. ఈ ఏడాదిన్నరలో తాము ఎలాంటి సంక్షేమం చేశామన్నది వివరిస్తే చాలన్నారు. ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ బీసీ సీఎం అంశంపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదన్నారు. అన్ని త్యాగాలకు సిద్ధపడే కులాల లెక్కలు తేల్చామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు