Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది.

author-image
By Bhavana
price
New Update

Tomato Prices

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వాటి ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. ముఖ్యంగా టమాట ధరలు వింటే గుండెలు చేతుల్లోకి జారిపోతున్నాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే కేవలం 15 రోజుల గ్యాప్‌ లో అవి మూడు రెట్లు పెరిగిపోయాయి. 

Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

 ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర 80 రూపాయలు పలుకుతుండగా.. అవి రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి రూ. 100 నుంచి 120 పలుకుతుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

Also Read: తొలి టీ20లో భారత్ ఘన విజయం!


అయితే.. టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. డిమాండ్‌కు సరిపడా టమాటా రాకపోవడమే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు అంటున్నారు. 

Also Read:  ఘోర ప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో కుటుంబం సజీవదహనం!

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీంతో సరఫరా తగ్గిపోవటంతో.. మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్తున్నారు. మొన్నటి వరకు కురిసి భారీ వర్షాలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి బాగా తగ్గింది. ఫలితంగా.. ధరలు అమాంతం పెరిగినట్టు చెప్తున్నారు. సాధారణంగా అయితే.. ఎండా కాలంలో టమాటా ధరలు ఎక్కువగా ఉంటాయి. 

Also Read: అర్బన్‌ నక్సల్స్‌తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ

కానీ.. ప్రస్తుతం ఎండకాలంలో కంటే కాస్త ఎక్కువగానే టమాటా మండిపోతుండటం గమనార్హం.  దీంతో.. టమాటా వ్యాపారులు భయపడుతున్నారు. భారీ రేట్లు పెట్టి తీసుకొచ్చిన సరుకు అమ్ముడుపోకపోతే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని ఆందోళన పడుతున్నారు. అయితే.. ఈ ధరలు మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అనుకుంటున్నారు.

#andhra-pradesh #telangana #tomato-prices
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe