IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. By Bhavana 07 Oct 2024 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి IMD: తెలంగాణ(Telangana) లో మరో రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఆదివారం సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెం,నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. Also Read: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. Also Read: అర్బన్ నక్సల్స్‌తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు(Tamilanadu) , దక్షిణ ఆంధ్రప్రదేశ్(AP) తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రభావం అక్టోబర్ 7, 8 తేదీల్లో యూపీ, బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది. Also Read: ఘోర ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో కుటుంబం సజీవదహనం! ఇదిలా ఉంటే కేరళ(Kerala) లో అక్టోబర్ 7 నుంచి 10 మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా తీరం చుట్టూ, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురియనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బే, ఉత్తర బెంగాల్, తమిళనాడు తీరానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇది కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. Also Read: తొలి టీ20లో భారత్ ఘన విజయం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి