Tomato Prices : మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే!
పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు.
పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రో నగరాలతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా ధర సుమారు రూ.90 పలుకుతోంది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి ఏర్పడింది.
తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్‌భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు.