Tiger: వరంగల్ జిల్లాలో పులి సంచరించడం కలకలం రేపుతోంది. ఇటీవల రాష్ట్రంలో వరుస పులుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి టైగర్ సంచారం సంచలనంగా మారింది. ఈ మేరకు నల్లబెల్లి మండలం రుద్రగుడెం పరిసర గ్రామాల్లోని పంట పొలాల్లో పులి తిరుగుతుందని, చాలా చోట్ల అడుగులు గుర్తించిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దండోరా వేయించిన పోలీసులు.. శుక్రవారం ఉదయం పంట పొలాల్లోకి వెళ్లిన స్థానిక వ్యవసాయదారులు.. పులి అడుగులు గుర్తించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్.. ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగులను పరిశీలించారు. అనంతరం అవి పులి అడుగులేనని నిర్ధారించిన ఆయన.. పోలీసులకు సమాచారం అందించి చుట్టుపక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చీకటి పడకముందే అందరూ ఇళ్లకు చేరుకోవాలని దండోరా వేయించారు. స్థానిక ఎస్సై గోవర్ధన్.. రుద్రగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు జాత్రగ్తా ఉండాలని సూచించారు. ఇది కూడా చదవండి: ఓటీటీలో ఒబామా మెచ్చిన ఇండియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.? ఇదిలా ఉంటే.. ఇటీవలే ఆదిలాబాద్, ములుగు అడవిలో బెంగాల్ టైగర్ తిష్టవేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండు నెలలకుగా మేటింగ్ కోసం తిరుగుతున్న పెద్దపులి.. ఇద్దరు మనుషులతోపాటు పశువులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా పులి సంచరిస్తున్న మార్గాన్ని సీసీటీవీ పుటేజీ ఆధారంగా గుర్తించి.. అది ఛత్తీష్ గడ్ నుంచి వచ్చినట్లు నిర్ధారించారు.