Encounter : గరియాబంద్ ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు తెలుగువారు

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో పలువురు తెలుగువారు ఉన్నారు. వారిలో మోడెం భాస్కర్, ప్రమోద్‌ ఎలియాస్‌ పాండు, జాడి వెంకటి ఎలియాస్‌ విమల్‌ ఎలియాస్‌ మంగన్న ఉన్నారు.

New Update
Encounter

Encounter

Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో జిల్లాలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో పలువురు తెలుగువారు ఉన్నట్లు గుర్తించారు. గరియాబంద్​ జిల్లా మైన్​పూర్​ పోలీస్​స్టేషన్ పరిధిలోని అడవుల్లో భాలూ డిగ్గీ గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించగా మావోయిస్టులు తారసపడటంతో రెండు వర్గాలకు మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పులతో మైన్​పూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్సుల్లో 10 మంది నక్సల్స్ మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌  ప్రాంతంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.కాగా ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు, తెలంగాణకు రాష్ర్టం భూపాల​పల్లి జిల్లా గణపవరం మండలానికి చెందిన మొడెం బాలకృష్ణ అలియాస్​ మనోజ్​ అలియాస్​ భాస్కర్​ (58) ఉన్నట్లు తెలిపారు. బాలకృష్ణపై కోటి రూపాయల రివార్డు ఉంది. 

Also Read: Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్

కాగా కేంద్ర కమిటీ సభ్యుడైన మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ కోసం పోలీసులు, కేంద్ర బలగాలు 9 నెలలుగా వేటాడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణను వారు టార్గెట్​ చేశారు. ఒడిశాలోని కంధమాల్–- కల్హండి–బౌధ్–-నయాగఢ్​(కేకేబీఎన్) డివిజన్​ను పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ అలియాస్ మనోజ్ వివరాలను ఇన్​ఫార్మర్ల ద్వారా సేకరించిన భద్రతాబలగాలు చత్తీస్​గఢ్ అడవుల్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఈ పక్కా సమాచారంతో తాజా ఎన్​కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. కాగా ఆయనతో పాటు మృతుల్లో మోడెం భాస్కర్, ప్రమోద్‌ ఎలియాస్‌ పాండులతో పాటు జాడి వెంకటి ఎలియాస్‌ విమల్‌ ఎలియాస్‌ మంగన్న ఉన్నట్లు గుర్తించారు. వెంకటిది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామం.  కాగా మోడెం బాలకృష్ణ అలియాస్‌ మనోజ్‌ (రూ.కోటి రివార్డు), ప్రమోద్‌ అలియాస్‌ పాండు (ఒరిసా రాష్ట్ర కమిటీ సభ్యుడు, 25లక్షల రివార్డు), విమల్‌ అలియాస్‌ మంగన్న (టెక్నికల్‌ టీం ఇన్‌చార్జి, 8 లక్షల రివార్డు) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో పట్టపగలే దారి దోపిడి.. 40 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!

Advertisment
తాజా కథనాలు