BIG BREAKING: హైదరాబాద్‌లో పట్టపగలే దారి దోపిడి.. 40 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!

హైదరాబాద్‌లో స్టీల్‌వ్యాపారి రాకేశ్ కళ్లలో కారం కొట్టి, బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితుల ప్లాన్‌ బెడిసికొట్టింది. రూ.40 లక్షలు దోచుకుని పారిపోతున్న సమయంలో కారు బోల్తా పడటంతో నిందితులు డబ్బును వదిలి పారిపోయారు.

New Update
robbery

hydarabad robbery

హైదరాబాద్‌లో కళ్లలో కారం కొట్టి, బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితుల ప్లాన్‌ బెడిసికొట్టింది. సినిమా స్టైల్‌లో రూ.40 లక్షలు దోచుకుని పారిపోతున్న సమయంలో కారు బోల్తా పడటంతో నిందితులు డబ్బును వదిలి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్టీల్‌ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ తన కారు డ్రైవర్, మరో బిజినెస్ పార్ట్‌నర్‌ను వికారాబాద్ నుంచి రూ.40 లక్షలు తీసుకురావాలని పురమాయించారు. వారు డబ్బు తీసుకుని శంకర్‌పల్లి మండలం పర్వేద వద్దకు చేరుకోగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం వారి కారును ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్న రాకేశ్ అగర్వాల్ మనుషులు దిగి కారంపొడి చల్లి, బొమ్మ తుపాకీతో బెదిరించి డబ్బు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు.

దోపిడీ యత్నం..

ఇది కూడా చదవండి: భర్తను చంపి పులి అంటూ నాటకం.. అడ్డంగా దొరికిపోయిందిగా!

అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం కొత్తపల్లి గ్రామం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. కారు బోల్తా పడటంతో నిందితులు భయపడి.. కొంత డబ్బును కారులోనే వదిలివేసి పారిపోయారు. వాహనం బోల్తా పడిన సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో లభ్యమైన రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి ఉపయోగించిన తుపాకీ బొమ్మదని.. కారు నెంబర్ ప్లేట్ కూడా నకిలీదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాకేశ్ అగర్వాల్ మనుషులు రూ.40 లక్షలు తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం..  రెండు చేతులు, కాలు తెగిపోయి

Advertisment
తాజా కథనాలు