/rtv/media/media_files/2025/11/08/cotton-2025-11-08-19-38-10.jpg)
Cotton
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. 300 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలిపోయింది. తన పంట కాలిపోవడాన్ని చూసి రైతు పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెజ్జంకికి చెందిన బండి ఐలయ్య అనే రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. తన భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వాటిలో పత్తి పంట సాగు చేశాడు. గత కొన్నిరోజులుగా పత్తి తీసే పనులు జరుగుతున్నాయి.
Also Read: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్
ఇంటికి తీసుకొచ్చిన పత్తిలో తడిని ఆరబెట్టేందుకు ఓ ఖాళీ స్థలంలో టార్పాలిన్లు వేశారు. అయితే శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కొన్ని క్షణాల్లోనే పత్తి మొత్తం కాలిపోయింది. ఇది గమనించిన ఐలయ్య, అతని కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. అయినా కూడా సాధ్యం కాలేదు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు.
Also Read: 'డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో ఈడీ రైడ్స్'
అయితే అప్పటికే 300 క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. నెలల పాటు పడ్డ కష్టం ఒక్కసారిగా బుడిదపాలు కావడంతో తీవ్ర ఆవేదన చెందారు. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI సౌజన్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Follow Us