/rtv/media/media_files/2025/08/28/actor-madhavan-2025-08-28-13-53-01.jpg)
Actor Madhavan
Actor Madhavan: స్టార్ హీరో మాధవన్ లడఖ్‌లో చిక్కుకుపోయినట్లు పోస్ట్ పెట్టారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విమానా రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు. ఈ క్రమంలో షూటింగ్ కోసం లఢక్ వెళ్లిన మాధవన్ అక్కడే చిక్కుకుపోయారు. విమానాలు రద్దవడంతో అయన తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని మాధవన్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ''మళ్ళీ లేహ్ లో ఇరుక్కుపోయాను! నో ఫ్లైట్స్'' అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే తాను ప్రస్తుతం స్టే చేస్తున్న లేహ్ ప్రాంతంలోని పరిస్థితిని చూపిస్తూ వీడియో పంచుకున్నారు. గది కిటికీలో నుంచి బయట పూర్తిగా మంచుతో కప్పబడిన పర్వతాలను చూపిస్తూ.. ఆగస్టు నెల చివరిలో కూడా లడఖ్‌లో ఇంత మంచు కురుస్తోందని చెప్పారు. "వాతావరణం అనుకూలిస్తే ఈరోజు నేను ఇంటికి వెళ్లగలనని ఆశిస్తున్నాను.. అయినప్పటికీ ఇక్కడ వాతావరణం చాలా అందంగా ఉంది" అని చెప్పారు.
Actor #RMadhavan is stuck in #Leh, says the airport has been shut for the past four days due to 'incessant rain' pic.twitter.com/9p1xv0Rmv5
— BombayTimes (@bombaytimes) August 27, 2025
గతంలోనూ ఇదే పరిస్థితి..
అయితే 2008 '3 ఇడియట్స్' మూవీ షూటింగ్ సమయంలోనూ తనకు ఇలాంటి సంఘటనే ఎదురైనట్లు గుర్తుచేసుకున్నారు. షూటింగ్ కోసం లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు ప్రాంతానికి వెళ్లగా.. అప్పుడు కూడా భారీగా మంచు కురవడంతో వెయిట్ చేయాల్సి వచ్చినదని తెలిపారు. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవ్వడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. తాను లడఖ్ లో షూటింగ్ కోసం వచ్చిన ప్రతిసారి ఇలాగే జరుగుతుందని గుర్తుచేసుకున్నారు.
ఇదిలా ఉంటే గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చండీగఢ్-కులూమనాలి జాతీయ రహదారి పలు చోట్ల బ్లాక్ అయిపోయింది. వేలాది వెహికిల్స్ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దాదాపు 50 కిలోమీటర్ల మేర స్తంభించిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంతో బీబీపేట నుంచి కామారెడ్డి రూట్ కి వెళ్లే వంతెన కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి నివసిస్తున్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షం కారణంగా కామారెడ్డికి రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి మీదుగా వెళ్లే వాహనాలన్నింటినీ బార్డర్ లోనే నిలిపివేశారు అధికారులు.
Also Read: Nivetha Pethuraj : ముస్లిం వ్యక్తితో నటి నివేతా పేతురాజ్ పెళ్లి.. ఎప్పుడంటే?