/rtv/media/media_files/2025/12/03/kokapet-2025-12-03-21-03-34.jpg)
Kokapet
Kokapet Lands: హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్ భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. బుధవారం మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. నెంబర్ 19లో ఉన్న ఎకరానికి రూ.131 కోట్లు, నెంబర్ 20లోని ఎకరానికి రూ.118 కోట్ల ధర పలికింది. మొత్తంగా ఈరోజు జరిగిన 8.04 ఎకరాలకు HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం చేకూరింది.
Also Read: టీచర్ల నియామక కుంభకోణం కేసు.. హైకోర్టు సంచలన తీర్పు
మొత్తం మూడు విడతల్లో చూసుకుంటే ఆరు ప్లాట్లలలో 27 ఎకరాలు అమ్ముడుపోయాయి. వీటికి రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 44 ఎకరాల భూమిని నాలుగు విడుతల్లో HMDA వేలం వేస్తోంది. కోకాపేట గోల్డెన్ మైల్‌లో 2 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాలకు డిసెంబర్ 5న ఈవేలం వేయనుంది.
Also Read: దారుణంగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక్క డాలర్‌కు 12 లక్షల రియాల్స్
Follow Us