Iran: దారుణంగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక్క డాలర్‌కు 12 లక్షల రియాల్స్‌

ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 12 లక్షల రియాల్స్‌కు దిగజారిపోయింది.

New Update
Iran’s currency falls to a new low as nuclear sanctions squeeze its ailing economy

Iran’s currency falls to a new low as nuclear sanctions squeeze its ailing economy

Iran: ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 12 లక్షల రియాల్స్‌కు దిగజారిపోయింది. అణు ఆంక్షల వల్ల ఇరాన్‌ పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కరెన్సీపడిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఓవైపు ధరలు పెరగడం మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: టీచర్ల నియామక కుంభకోణం కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాక ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఆ దేశంతో ముడిచమురు వ్యాపారం చేస్తున్న కంపెనీలపై కఠినంగా ఆంక్షలు పెట్టారు. వీటిలో చైనాకు డిస్కౌంట్‌తో అమ్ముతున్న పలు చమురు సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి కూడా ఇరాన్‌పై విధించిన అణు ఆంక్షలను పునరుద్ధరించింది. దీని ప్రభావంతో ఇరాన్ ఆస్తులు విదేశాల్లో సైతం స్తంభించిపోయాయి. ఆయుధ ఒప్పందాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అంతేకాదు ఇరాన్‌ బాలిస్టిక్ మిస్సైల్‌ ప్రొగ్రామ్‌లో ఏదైన పురోగతి ఉంటే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.  

ఇరాన్‌లో అవినీతి పెరగడంతో పాటు.. పవర్‌ గ్రిడ్‌ల వైఫల్యం వల్ల దేశంలో గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ఇంధన సంక్షోభం కూడా పెద్ద సమస్యగా మారింది. అక్కడ భారీగా సహజవాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్నాకూడా వాతవరణ పరిస్థితులకు తగ్గట్లు ఇంధన వ్యాపారం జరగడం లేదు. అవసరమైన సమయాల్లో ఇంధన కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: రేపు, ఎల్లుండి భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు

మరోవైపు అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతూ ఉంది. 2015లో అమెరికాతో ఇరాన్‌ అణు ఒప్పందం చేసుకుంది. ఆ సమయానికి ఒక డాలర్‌కు దాని కరెన్సీ 32 వేల రియాల్స్ ఉండేవి. అయితే 2018లో ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటికి వచ్చేశారు. మరోసారి డీల్‌ కోసం చర్చలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి. దీంతో రియాల్ విలువ దిగజారుతూ వస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 7.03 లక్షలకు చేరింది. ఇప్పుడు 12 లక్షలకు చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు