Bandi Sanjay: వారికి మావోయిస్టులతో సంబంధాలు...వెంటనే  తెంచుకోండి..లేదంటే...బండి సంజయ్ వార్నింగ్

మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్‌ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అలాంటి నెట్ వర్క్ ల నుంచి పక్కకు తప్పుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌  సూచించారు.

New Update
Bandi Sanjay's warning

Bandi Sanjay's warning

Bandi Sanjay: మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్‌ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ  సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు ఎక్స్ వేదికగా సదరు రాజకీయ నాయకులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్‍వర్క్ కు మద్దతు ఇస్తున్నవారు వెంటనే ఆ సంబంధాలు తెంచుకోవాలని లేదంటే అలాంటి వారు బహిర్గతం కాక తప్పదని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. 

మావోయిస్టులు వర్గాలు విడిపోయారని, అందులో ఒక మావోయిస్టు  వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కు అయిందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్‌ లో పోస్టు చేసిన ఆయన సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఏర్పాటు చేసిన  కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టు కార్యకర్తల వద్దే ఆగిపోవని, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్రం.. అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న వారిని కూడా వెంటాడుతుందన్నారు. అలాంటి వారి పట్ల ఎలాంటి కనికరం, ఉదాసీనత లేకుండా నిర్మూలించడానికి వెనుకాడదని తేల్చి చెప్పారు.

Also Read :  తెలంగాణలోకి హిడ్మా ఎంట్రీ ? ఆయన ప్లాన్‌ అదేనా?

మీరు ఎవరైనా కావచ్చు. ఎంతటి పెద్దవారైనా కావచ్చు.. కానీ, అలాంటి నెట్ వర్క్ ల నుంచి పక్కకు తప్పుకోవాలని బండి సంజయ్‌  సూచించారు.వారితో కలిసి దేశ అంతర్గత భద్రతకు విఘాతంగా నిలిస్తే మీరు ఎంత పెద్ద నాయకులైనా కూలిపోవాల్సిందే అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కాగా అదే ట్వీట్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ ఎక్స్ లో పోస్టు చేయడం సంచలనంగా మారింది.

కాగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. కాగా తెలంగాణలో 
మావోయిస్టులతో సంబంధం ఉన్న నాయకులు ఎవరూ అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్‌

Advertisment
తాజా కథనాలు