/rtv/media/media_files/2025/12/23/shivaji-comments-2025-12-23-10-45-23.jpg)
Actor Shivaji
Actor Shivaji: టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ రోజు బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరైన శివాజీ.. కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
Also Read: నాపై కుట్ర జరుగుతోంది...మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
కాగా ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందులోనూ తనకు బాగా కావాల్సిన వారే ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివాజీ వివరణ ఇస్తూ అనుకోకుండా మాటలు దొర్లాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన చెప్పినట్లు సమాచారం.
Also Read: 'రాజా సాబ్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజ్ రెడీ..?
అనంతరం శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఏం తప్పు చేశానని నా మీద ఇంత కుట్ర చేస్తున్నారు. మీ అమ్మానాన్న మీ ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా? ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి? ఎవరి దుస్తులు వారి ఇష్టం. ఇంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ కోసం అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘దండోరా’ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌కు కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డవారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగింది. వాటికి నేను సమాధానం చెప్పా. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు. అని శివాజీ చెప్పుకొచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి. నాపైన కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలు పెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ చర్చించారు. నాకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు’’ అని శివాజీ ఆరోపించారు.
Also Read: సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్ ఫ్రం రైల్వే స్టేషన్
‘‘శివాజీ తప్పు చేశాడనుకుంటే రండి మాట్లాడుకుందాం అని అన్నారు. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గోప్యంగా ముందుకు వెళ్తోంది. ఎవరి హక్కులకు భంగం కలిగినా రక్షించే వ్యవస్థలు ఉన్నాయి. సలహాలు ఇవ్వటం మానుకోవాలని నాకు అర్థమైందన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇంకా వివరణ ఇవ్వాల్సి వస్తే మళ్లీ కమిషన్ ముందుకు వస్తా. ఆడవాళ్లకు నచ్చని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. సినిమాలు రాకపోతే, వ్యవసాయం చేసుకొని బతుకుతా. నాది రైతు కుటుంబం. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు’’ అని శివాజీ చెప్పుకొచ్చారు.
Also Read: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్ సిందూర్ భయం
‘‘అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని కొంతమంది అంటున్నారు. ఎవరి బెదిరింపులకు నేను భయపడను. ఆత్మాభిమానం చంపుకొని అస్సలు బతకను. అదే సమయంలో వ్యవస్థలను, నేనుండే చిత్ర పరిశ్రమను గౌరవించకుండా విలువల్లేని బతుకు కూడా బతకడం లేదన్నారు. ప్రతి ఒక్క దానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. నాగబాబు గారు ఏమన్నారో చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరూ మాట్లాడలేరు. ఈ భూమ్మీద ఎవరిని ఎవరూ సంతృప్తి పరచలేరు. ‘యథార్థ వాది లోక విరోధి’’ అని అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.
Follow Us