Operation Sindoor: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్‌ సిందూర్‌ భయం

పహల్గామ్ లోయలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న పాక్‌ఉగ్రమూకలకు భారత్‌ వారి దేశంలోనే గట్టి బుద్ది చెప్పిన విషయం తెలిసిందే. నాటి దాడితో పాకిస్థాన్‌కు భయం పట్టుకుంది. దాయాది దేశానికి ఆపరేషన్ సిందూర్‌ భయం ఇంకా వదలట్లేదు.

New Update
FotoJet (20)

 Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ లోయలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న పాక్‌ఉగ్రమూకలకు భారత్‌ వారి దేశంలోనే గట్టి బుద్ది చెప్పిన విషయం తెలిసిందే. పలువురు ఉగ్రవాదులను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి పలువురు ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో నాటి నుంచి కూడా పాక్‌కు ఆపరేషన్ సిందూర్ భయం వెంటాడుతోంది. అందుకే తాజాగా ఎల్‌ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని  కదిలించింది. విహారయాత్రకు వెళ్లిన సామాన్య పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి26 మంది ప్రాణాలు తీశారు. ఈ దాడిలో మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతులు మొదలు, చిన్నపిల్లల వరకు ఉన్నారు. హిందూవులను హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడిన తీరు కోట్లాది హృదయాలను కలిచివేశాయి.  

Also Read: 'రాజా సాబ్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. మరో ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజ్‌ రెడీ..?

అయితే దీనికి  ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులకు దిగింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. బాంబుల వర్షం కురిపించింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలిసింది. అయితే నాటి దాడితో పాకిస్థాన్‌కు భయం పట్టుకుంది. దాయాది దేశానికి ఆపరేషన్ సిందూర్‌ భయం ఇంకా వదలట్లేదు. దీంతో భారత్‌తోఉన్న సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్‌ సిందూర్‌ భయం

సరిహద్దుల్లో గట్టి నిఘా 

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్‌ని పాక్‌12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్‌లపై ప్రత్యేక నిఘా ఉంచనుందని తెలుస్తోంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్‌లోని రావల్కోట్‌లోనూ ఈ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయట. ఈ సిస్టమ్‌లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ కూడా ఉందని తెలుస్తోంది.

Also Read: నాపై కుట్ర జరుగుతోంది...మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ

దీనితో పాటు డ్రోన్ సాంకేతికతను మరింత పెంచుకునేందుకు టర్నీ, చైనాలతో పాకిస్థాన్ చర్చలు జరుపుతుంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు