Kothagudem Corporation: కొత్తగూడెంలో కాంగ్రెస్ కొత్త మెలిక.. సీపీఐకి బిగ్ షాక్ ఇచ్చిన పొంగులేటి!

కొత్తగూడెంలో కార్పొరేషన్ చేజిక్కిచుకోవాలని సీపీఎం ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి బీఆర్ఎస్‌తో కూడా కలిసిపోవడానికి ఓకే చెప్పింది. తీరా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం విషయంలో అధికార కాంగ్రెస్, సీపీఐల మధ్య ఓ అంగీకారం కుదిరింది.

New Update
karimnagar

కొత్తగూడెంలో కార్పొరేషన్(kothagudem corporation) చేజిక్కిచుకోవాలని సీపీఎం(cpm) ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి బీఆర్ఎస్‌తో కూడా కలిసిపోవడానికి ఓకే చెప్పింది. తీరా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం విషయంలో అధికార కాంగ్రెస్, సీపీఐ(cpi) ల మధ్య ఓ అంగీకారం కుదిరింది. అధికారాన్ని పంచుకోవాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి రెండున్నర ఏళ్లపాటు సీపీఐకి మేయర్, కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవులు ఇవ్వాలని, ఆ తర్వాతి రెండున్నరేళ్లు కాంగ్రెస్‌కి మేయర్, సీపీఐకి డిప్యూటీ మేయర్ ఇవ్వాలనే అవగాహనకు వచ్చాయి. కార్పొరేషన్ విషయంలో నెల కొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకుగాను ఇరు పార్టీల నేతలు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. 

జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెం కటరెడ్డి, ఈటీ నరసింహలు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా మేయర్ పదవి ఎవరు తీసుకోవాలనే దానిపై జరిగిన చర్చలో తమకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ(congress) సీపీఐని కోరింది. కానీ రాష్ట్రంలో వామపక్షాలకు ఒక మేయర్ స్థానాన్ని ఇవ్వడం సానుకూల సంకే తాలను ఇస్తుందని, ఈ విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించాలని సీపీఐ నేతలు కోరారు. సీపీఐ నేతల విజ్ఞప్తితోపాటు ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలన్న ఏఐసీసీ సూచన మేరకు సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్లు సీపీఐ నేతల ప్రతిపాదనకు అంగీకరిం చారు. దీంతో కొత్తగూడెంలో కాంగ్రెస్, కామ్రేడ్ల కథ సుఖాంతమైంది. ఈ అధికార పంపిణీ విషయాన్ని సీపీఐ నేతలతో సమావేశ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా ధ్రువీకరించారు.

Also Read :  బండి సంజయ్‌కు బిగ్ షాక్.. కరీంనగర్‌పై BRS, కాంగ్రెస్ కొత్త స్కెచ్ ఇదే?

ఆ రెండు కూడా

ఇప్పటికే నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ కాగా ఇప్పుడు కొత్తగూడెం విషయంలోనూ ఓ అవగాహన కుదిరింది. ఇక మిగిలిన నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు కూడా తామే దక్కించుకుంటామనే ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్ ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని, కరీంనగర్‌లో కూడా మ్యాజిక్ ఫిగర్ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని, తమతో వచ్చే ఇండిపెండెంట్ల సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం గమనార్హం. - Municipal Election Results 2026

Also Read :  మున్సిపల్ ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు