చెరువులోకి దూసుకెళ్లిన కారు| Car Intrudes into Lake | RTV
చెరువులోకి దూసుకెళ్లిన కారు| Car Intrudes into Lake While Learning and this incident happened in Janagama District in Telangana and however Travellers are safe | RTV
చెరువులోకి దూసుకెళ్లిన కారు| Car Intrudes into Lake While Learning and this incident happened in Janagama District in Telangana and however Travellers are safe | RTV
జనగామలో గౌతమ్ మోడల్ స్కూల్ బస్ శుక్రవారం సాయంత్రం అడవి కేశవాపూర్ గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ అదే స్కూల్లోచదువుతున్నాడు.బస్ నుంచి కిందకి దిగుతున్నవిద్యార్థి పడిపోగా..గమనించని డ్రైవర్.. బస్సు పోనిచ్చాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
జనగామ పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబం, బంధువులతో కలసి అయోధ్య యాత్రకు వెళ్లారు.అక్కడ సరయూ నదిలో స్నానం చేస్తున్న క్రమంలో నాగరాజు పెద్ద కుమార్తె తేజశ్రీ (17) నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఎంత వెతికినప్పటికీ ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జనగామ జిల్లాలో ధ్రమకంచ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ వర్గీయులకు, కాంగ్రెస్ వర్గీయులకు మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో 180 మంది రైతులు సూసైడ్ చేసున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం పర్యటించిన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ తో హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్గేజ్ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంటు కావాలా? మీరే తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు.