/rtv/media/media_files/2025/02/18/APOg042jgc1Su1NClyEo.webp)
Fake IT Jobs
ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు..
నిరుద్యోగుల వివరాలను సేకరించేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెస్యూమ్‌లు కొనుగోలు చేసి, వారికి జాబ్ ఆఫర్లు వచ్చాయని మెయిల్స్ పంపేవాడు. అనంతరం, ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగం పొందేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవాడు. “బ్యాక్‌డోర్ ఉద్యోగాలు” అనే పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసాడు భార్గవ్. ఇలా చాలామందికి ఆశలు పెట్టి నిరుద్యోగుల నుండి డబ్బులను వాసులు చేసినట్లు సమాచారం. ఎన్ని నెలలు గడిచినా ఉద్యోగాలు మాత్రం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పలుమార్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిలదీశారు. దీంతో నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది.
Also Read : ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
అయితే, నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక లక్ష నగదు, 5 నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, 2 నకిలీ ఐడీ కార్డులు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భార్గవ్‌పై ఇప్పటికే లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఉద్యోగ అవకాశాలను పరిశీలించకుండా డబ్బులు చెల్లించరాదని పోలీసు అధికారులు సూచించారు. జాబ్ ఆఫర్ల పేరుతో డబ్బులు అడిగిన వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Also Read: Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు
Also Read : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. 20 రాష్ట్రాల CMలు, 50 మంది సెలబ్రెటీలు