Bandi vs Etela: సీట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు..తలపట్టుకున్న అధిష్టానం..!!
తెలంగాణ బీజేపీలో కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లు పలు చోట్ల వారి అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండికేయడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది
/rtv/media/media_files/2025/07/21/bandi-sanjay-vs-etela-rajender-2025-07-21-15-16-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/etela-vs-bandi-jpg.webp)