/rtv/media/media_files/2025/03/21/DWTA1xvJf916uppoMaqX.jpg)
Telangana Ration Cards
BIG BREAKING: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 వ తేదీన సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.తద్వారా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది.
Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!
గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే గతంలో ప్రకటించినట్లు స్మార్ట్ కార్డులు అందజేస్తారా? లేక నార్మల్ కార్డులు అందజేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
Also Read:NIA Most wanted Terroist: కపిల్ శర్మ కేఫ్‌పై మెస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ ఎటాక్.. అతని చరిత్ర తెలిస్తే వణుకుతారు
14న రేవంత్ రెడ్డి కార్డులు జారీ చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల వల్ల కొత్త రేషన్ కార్డులు పేదలకు చేరలేదు. ఎప్పటికప్పుడు దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తోంది. కానీ, పంపిణీ మాత్రం చేయలేదు. కాగా ఇప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చు కూడా.
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్