NIA Most wanted Terroist: కపిల్ శర్మ కేఫ్‌పై మెస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ ఎటాక్.. అతని చరిత్ర తెలిస్తే వణుకుతారు

కెనడాలో నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి అని భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇతనిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. వికాస్ ప్రభాకర్ హత్య కేసులోనూ ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి

New Update
Kaps cafe

Kaps cafe

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో నటుడు కపిల్ శర్మ కేఫ్ వెలుపల కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కాల్పుల్లో ఎవరికి ఏం కాలేదు. కానీ కాస్త భయంకరమైన వాతావరణం ఈ ప్లేస్‌లో ఏర్పడింది. అయితే ఈ కాల్పులకు బాధ్యుడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి అని భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇంతకీ ఈ హర్జీత్ సింగ్ లడ్డి ఎవరనేది తెలుసుకుందాం.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి: Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!

ఇతనిపై రూ.10 లక్షల రివార్డు

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హర్జీత్ సింగ్ లాడిపై రూ.10 లక్షల రివార్డును భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. పంజాబ్‌లోని నవాన్‌షహర్ జిల్లాలోని గడ్పధానా గ్రామానికి చందిన VHP నాయకుడు వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బబ్బర్ ఖల్సా అనేది ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ.

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

ఇది భారతదేశం, కెనడా, యూకే దేశాల్లో ఉంది. బబ్బర్ ఖల్సా చరిత్ర బ్రిటిష్ కాలం నాటి 'బబ్బర్ అకాలీ' ఉద్యమం జరిగింది. ఖలిస్తానీ కార్యకలాపాలపై భారతదేశం, కెనడా మధ్య ఇప్పటికే దౌత్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. భారతదేశం కూడా గతంలో కెనడా నుండి అటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో ఉగ్రవాదిని అప్పగించాలని భారత ఏజెన్సీలు కెనడాను కోరుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు