/rtv/media/media_files/2025/01/21/3pE1rUIQS0NYCF4Ufv9o.jpg)
fog
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదైనట్లు తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ఉదయం వేళ వరకు బాగా మంచు కురుస్తుండగా, మధ్యాహ్న సమయంలో ఒకవైపు ఎండలు, మరోవైపు చలిగాలులు వీస్తున్నాయి.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో వారంపాటు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.బుధవారం ఉదయం పర్చుకున్న మంచుదుప్పటి కారణంగా 40 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనం సమీపంలోకి వచ్చే వరకు కనిపించక పోవడంతో ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాహన చోదకులు అంటున్నారు.
Also Read: Kolkata: సంజయ్ రాయ్ శిక్షపై మమతా సర్కార్ అసంతృప్తి..కీలక నిర్ణయం
వాహనాల లైట్లు వేసుకుని వెళ్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని అంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు దాటే సమయంలో ప్రజలు భయపడుతున్నారు. ఉత్తర కోస్తాలో రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లా బేలాలో 8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9, నిర్మల్ జిల్లా పెంబీలో 9.3, రంగారెడ్డి జిల్లా మొహినాబాద్‌లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వివరించింది.
Also Read: Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..
Also Read: Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్ తో అదరగొట్టిన ట్రంప్!