Rajaiah : కడియం ఓ కామాంధుడు.. మహిళలు చెప్పులతో కొట్టారు.. రాజయ్య షాకింగ్ కామెంట్స్!

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కామాంధుడని ఆయన అనుచరులే చెబుతున్నారని రాజయ్య అన్నారు. హనుమకొండ లోని టీచర్ కాలనీలో, పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర కడియం శ్రీహరిది అని ఆరోపించారు.

New Update
rajaiah

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(kadiyam srihari) పై మాజీ ఎమ్మెల్యే రాజయ్య(thatikonda-rajaiah) సంచలన కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కామాంధుడని ఆయన అనుచరులే చెబుతున్నారని రాజయ్య అన్నారు. హనుమకొండ లోని టీచర్ కాలనీలో, పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర కడియం శ్రీహరిది అని ఆరోపించారు. సొంత భార్యనే అతన్ని చెంపదెబ్బ కొట్టిందన్నారు. కడియం శ్రీహరి తన వెంట్రుక కూడా పీకలేడన్నారు. తాను సొంత విషయాలకు  పోకూడదని అనుకున్నానని, కానీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాజయ్య ఫైరయ్యారు.  ఆరు నూరైనా ఘనపూర్ కు ఉపఎన్నిక రావడం ఖాయమని చెప్పిన రాజయ్య..  ఉపఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేసి, పర్వతగిరికి తరిమి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read :   HYDERABAD METRO: ఆగనున్న హైదరాబాద్ మెట్రో.. L&T ఔట్.. నెక్ట్స్ ఏంటి?

తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్

స్టేషన్ ఘన్ పూర్(station-ghanpur) నియోజకవర్గం రఘునాథపల్లి మండలం రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ, మూడో విడత పాదయాత్రను చేపట్టినతాటికొండ రాజయ్యని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా చెప్పాలన్న రాజయ్య..  దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. తనపై తన అనుచరులతో సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. 

సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయ్

ఇటీవల కూడా కడియంపై  రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోడానికి కూడా కడియంకు సిగ్గులేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాజీనామా చేయమని అని తిడుతున్న కూడా కడియంకు సిగ్గు వస్తలేదని మండిపడ్డారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదని రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే... మగాడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య సవాల్ విసిరారు. తన కూతురు కోసం పార్టీ ఫిరాయించి రెండు వందల కోట్లకు ఎమ్మెల్యే అమ్ముడు పోయాడని రాజయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ కడియం శ్రీహరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల30లోపు నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. 

Also Read :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌..పోటీలో  కవిత జాగృతి అభ్యర్థి ?

Advertisment
తాజా కథనాలు