Actor Fish Venkat: ఫిష్ వెంకట్ కి సీరియస్.. వెంటిలేటర్ పై చికిత్స
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో వారం రోజులుగా వెంటిలేటర్‌పైనే ట్రీట్మెంట్ పొందుతున్నారు.