TG LAWCET: లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌ అభ్యర్థులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు జూన్‌ 25న (బుధవారం) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.

New Update
TS LAWCET 2025 and PGLCET 2025 results will be released tomorrow

TS LAWCET 2025 and PGLCET 2025 results will be released tomorrow

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌ అభ్యర్థులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు జూన్‌ 25న (బుధవారం) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు మసబ్‌ ట్యాంక్‌లో లాసెట్, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.  

Also Read: పార్టీ బాధ్యతలు నిర్వహిస్తేనే పదవులు...సీఎం రేవంత్‌ స్పష్టీకరణ

ఇదిలాఉండగా జూన్ 6న లాసెట్, పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 57,715 మంది వీటికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 45, 609 మంది పరీక్షకు హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎంకు 13,492 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 

Also Read: తేజేశ్వర్ హత్యకేసులో మరో ట్విస్ట్..భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్..ఆరోసారి సక్సెస్

Advertisment
Advertisment
తాజా కథనాలు