TS TET 2026 : నేటి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు..పరీక్షలకు సర్వం సిద్ధం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ఈ రోజు (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.  

New Update
FotoJet (61)

Telangana Teacher Eligibility Test

TG Tet

 2026 :  తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ఈ రోజు శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అంటే 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలను పూర్తి చేస్తారు. టెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.  కాగా ఈ పరీక్షలకు గాను పేపర్‌–1, పేపర్‌–2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 71,670 మంది ఇన్‌ సర్విస్‌ టీచర్లు ఉన్నారు. టెట్‌ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయడానికి  దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 

 తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… మొదటి సెషన్ ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ -2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. కాగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ పలు సూచనలు చేసింది.

అభ్యర్థులకు కీలక సూచనలు :

అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కు నిర్ధేశించిన సమయంకంటే ముందుగానే చేరుకోవాలి. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను సెంటర్‌లోకి అనుమతిస్తారు.
గేట్లను క్లోజ్ చేసిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు.
అభ్యర్థులు తప్పని సరిగా హాల్ టికెట్ ను తీసుకెళ్లాలి.
ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి.
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రం లోపలికి తీసుకెళ్లడానికి అవకాశం లేదు.
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులో వివరాలను సరి చూసుకోవాలి.
హాల్‌టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్‌ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు ఫొటోను అతికించి గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని రావాలి.
అభ్యర్థి పేరులో దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకునే అవకాశం ఉంటుంది.
పరీక్ష సమయం పూర్తి అయిన తర్వాతనే అభ్యర్థులను బయటికి అనుమతిస్తారు.

టీజీ టెట్ - 2026 పరీక్షల షెడ్యూల్ ఇలా..

జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది.
జనవరి 4న మొదటి సెషన్‌ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.
జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
జనవరి 6న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది.
జనవరి 19వ తేదీన మెుదటి సెషన్‌లో పేపర్ 1(మైనర్) పరీక్ష.. అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ మీడియంలో వారికి ఉంటుంది.
జనవరి 20వ తేదీన మెుదటి సెషన్ పేపర్ 2(మైనర్) పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది.
టెట్ పరీక్షల షెడ్యూల్ వివరాలను https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు