TG-TET: తెలంగాణలో ఈరోజు టెట్‌ నోటిఫికేషన్‌.. పరీక్షలు ఎప్పటినుంచంటే ?

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

TET
New Update

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతీ సంవత్సరం రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని గతంలోన రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. 

Also Read: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్‌ ఆఫర్‌.. మూడు నెలల పెన్షన్ ఒకేసారి!

ఈసారి అభ్యర్థుల సంఖ్య తగ్గే ఛాన్స్

ఈ నేపథ్యంలోనే సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను దాదాపు 2.35 లక్షల మంది రాశారు. వాళ్లలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి డీఎస్‌సీ కూడా పూర్తి అయినందున పరీక్ష రాసేవాళ్ల సంఖ్య స్వల్పంగా తగ్గిఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో పరీక్షలైనందువల్ల కనీసం వారం పదిరోజుల పాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది.   

Also Read: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా..

అయితే పరీక్షలు సంక్రాంతి పండుగ లోపే జరుగుతాయా ? లేదా ఆ తర్వాత జరుగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు. టెట్‌ పేపర్ -1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసినవాళ్లు అర్హులు అవుతారు. ఇక స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందడానికి టెట్‌ అర్హత ఉండాలని చెప్పడంతో వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ ఆవిర్భవం తర్వాత గత మే నెలలో జరిగిన పరీక్షతో కలుపుకుని ఆరుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపలే రెండోసారి టెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. 

Also Read :   సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్

Also Read :  Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?

#telugu-news #telangana #telangana-tet #tg-tet-notification
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe