ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్షన్ ఒకేసారి! ఫించనుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒక నెల తీసుకోకపోతే రెండు నెలలది కలిపి మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో ఇదే పద్ధతి ఉన్న వైసీపీ ప్రభుత్వం నెలవారీగా తప్పనిసరిగా తీసుకోవాలని రూల్ పెట్టింది. By Kusuma 04 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం పింఛనుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇదివరకు ఏ నెల అయిన పింఛను తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. కానీ ఇక నుంచి ఏ నెలలో అయిన పింఛన్ తీసుకోకపోతే తర్వాత నెలలో రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తం మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే ఛాన్స్ ఇస్తోంది. ఇది కూడా చూడండి: సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్ మూడు నెలలకొకసారి.. గతంంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అమలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ నెల తీసుకోవాలని నిబంధన పెట్టింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్‌దారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతీ నెల వెళ్లి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మూడు నెలలకి ఒకసారి వెళ్లి తీసుకోవచ్చు. దీనివల్ల టికెట్ ఛార్జీలు కూడా వారికి మిగులుతాయి. ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పద్ధతిని కొనసాగించారు. కానీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఏ నెల పింఛను అదే నెలోల తీసుకోవాలని రూల్ పెట్టింది. ఒక నెల తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. దీంతో పింఛనుదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది కూడా చూడండి: నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే? ఏపీలో మొత్తం పెన్షన్‌దారులు 64.14 లక్షల మంది ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అందిస్తోంది. ఈ నవంబర్‌లో పింఛను అందుకోని వారు డిసెంబర్ 1న రెండు నెలలది కలిపి ఒక్కసారి తీసుకోవచ్చని తెలిపింది. ఈ నెలలో దాదాపుగా 45,000ల మంది పింఛను తీసుకోకపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇది కూడా చూడండి: విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని.. #ap-governmant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి