రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో 'మిస్టర్ బచ్చన్' డిజాస్టర్ పై స్పందించారు. రీమేక్ అవసరమా అని అడిగితే వినలేదు. సినిమాను లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
tgvswa

మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. కానీ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ను సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి. 

అవుడ్ డేటెడ్ కంటెంట్ తీసుకోని దానికి కమర్షియల్ హంగులు అంటూ హరీష్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో  'మిస్టర్ బచ్చన్' డిజాస్టర్ పై స్పందించారు. 

Also Read : అంధుడి పాటకు సజ్జనార్ ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కీరవాణికి రిక్వెస్ట్

అప్పటికే చాలా లేట్ అయిపోయింది..

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.." సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. రీమేక్ అవసరమా అని నేను మొదటే అడిగాను. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను. 

80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నాం. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుండేది.." అంటూ చెప్పుకొచ్చారు. నిర్మాత చెప్పినదాన్ని బట్టి చూస్తే తప్పంతా హరీష్ శంకర్ దే అని స్పష్టమవుతుంది. మరి దీనిపై డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Also Read : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు