కాసేపట్లో అసెంబ్లీ శీతాకాలు సమావేశాల ప్రారంభం కానుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదానీ రేవంత్ భాయ్.. భాయ్ అని ఉన్న టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. సెక్యురిటి సిబ్బంది వారిని అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటిఆర్, హరీశ్ రావు, సభితా ఇంద్రారెడ్డి, కవిత, విజేయుడు ఇంకా కొందరు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. తర్వాత వారు అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్ అని ఉన్న టీ షర్ట్స్ తో అసెంబ్లీకి వచ్చారు. Also Read: తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి Also Read: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా భధ్రతా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ అధికారులు, సిబ్బంది తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, అదానీ భాయ్ భాయ్ అని రాసి ఉన్న టీషట్స్ వేసుకోవడానికి అసెంబ్లీ నిర్వహణ అధికారులు అత్యంతరం వక్తం చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ.. బీజేపీ ఎమ్మెల్యేలు ట్రాక్టర్ పై అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10. 30 లకు అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా.. గేటు బయటే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకువచ్చారు.Also Read: తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి