/rtv/media/media_files/2026/02/21/hyd-2026-02-21-08-55-46.jpg)
HYD
హైదరాబాద్లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 1100 కీలకమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. అయితే ఈ డేటాను రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ కాలిపోయిన డేటాను తిరిగి పొందడం అసాధ్యమని బృందం స్పష్టం చేసింది. దగ్ధమైన ఫైల్లో అనేక క్రిమినల్ కేసులకు సంబంధించిన కీలక డేటా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వీటిలో హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక నేరాలు, డ్రగ్స్ వంటి అనేక సంచలనాత్మక క్రిమినల్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us