/rtv/media/media_files/2025/07/15/wife-killed-his-husband-in-yadadri-bhuvanagiri-2025-07-15-10-43-19.jpg)
wife killed his husband in Yadadri Bhuvanagiri
దేశ వ్యాప్తంగా భర్తలను హతమారుస్తున్న భార్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. మొదట అందరూ.. దీనిని సాధారణ యాక్సిడెంట్‌గానే భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
కారుతో ఢీకొట్టించిన భార్య
యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి వద్ద సోమవారం (జూలై 14) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న స్వామిని వెనుక నుంచి వచ్చిన ఒక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గుర్తించి అతడిని హాస్పిటల్‌లో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ.. సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలించారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు.. ఘటనను లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. భార్యే పక్కా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేయించినట్లు నిర్ధారణ అయింది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ఒక కారుని రెంట్‌కు తీసుకుని భర్త స్వామిని చంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్లాన్‌లో భార్యతో పాటు మృతుడి బావమరిది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతుడు స్వామి భార్యతో పాటు బావమరిది, సుపారి కిల్లర్స్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!