/rtv/media/media_files/2025/09/04/sgt-teacher-suspended-after-drunk-2025-09-04-12-51-58.jpg)
sgt teacher suspended after drunk
ఓ సారూ.. మా పిల్లలకి మంచిగా చదువు చెప్పండి. వారిని సరైన మార్గంలో నడిపించండి.. వారి జీవితాల్లో వెలుగులు నింపండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కు పంపిస్తున్నారు. కాయ కష్టం చేసుకుంటూ.. తమలా తమ పిల్లలు ఎండ, వానల్లో కష్టపడకుండా ఉండాలని.. వారికి మంచి విద్య అవసరమని స్కూళ్లకు పంపిస్తున్నారు. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం విద్యాబుద్దులు నేర్పించాల్సింది పోయి.. వారిని సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి.. వారే దారి తప్పుతున్నారు.
Also Read : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసే ముందు చేసే పూజల ప్రత్యేకత ఏంటో తెలుసా?
తప్పతాగిన ఉపాధ్యాయుడు సస్పెండ్
పిల్లలకు చదువు చెప్పమని ఉద్యోగం ఇస్తే.. తప్పతాగి స్కూళ్లలో పిల్లల ముందే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. చిన్నారులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు.. తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరేమో పిల్లల చేత చాకిరీలు చేయించుకుంటుంటే.. మరికొందరు మసాజ్‌లు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. చివరికి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి తెలంగాణ(Telangana) లో జరిగింది. ఓ ఉపాధ్యాయుడు తప్పతాగి క్లాస్ రూమ్‌కు వచ్చాడు. అక్కడే మత్తులోకి జారుకుని టేబుల్ కింద పడుకున్నాడు. చివరికి సస్పెన్షన్‌కు గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుత్ పల్లిలోని ఏహెచ్ఎస్ పాఠశాలలో చోటు చేసుకుంది. జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో SGT టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఫుల్‌గా మద్యం తాగి క్లాస్ రూమ్‌లోకి తూగుతూ తూగుతూ వచ్చి కింద పడిపోయాడు. అది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
తప్పతాగి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్ సస్పెండ్
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025
ఆసిఫాబాద్ - జైనూర్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి, నిబంధనలు ఉల్లంఘించిన SGT జే. విలాస్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి
జైనూర్ మండలం సుకుత్ పల్లి AHSలో SGTగా… pic.twitter.com/wEfIVwn3of
వెంటనే ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పుబట్టారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి విచారణకు ఆదేశించారు. దీంతో విచారణలో ఆ ఉపాధ్యాయుడు నిజంగానే తప్పతాగి విధులకు హాజరైనట్లు తేలింది. దీంతో ఆమె సీరియస్ అయ్యారు. విధులను నిర్లక్ష్యం చేసినందుకు ఆ టీచర్ విలాస్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : KCRను ఓడించేందుకు హరీష్ డబ్బులు.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్!
ఇలాంటిదే మరో ఘటన
ఇదిలా ఉంటే తాజాగా అలాంటిదే మరొక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా హరూర్ ప్రాంతంలోని మావేరిపట్టి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన విధులను నిర్లక్ష్యం చేశారు. క్లాస్ రూమ్‌లో చిన్న పిల్లల చేత కాళ్లకు మసాజ్ చేయించుకున్నారు. ఒక టేబుల్ పై పడుకుని ఉండగా.. చిన్నారులు ఆమె కాళ్లకు మసాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో సైతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆమెను సస్పెండ్ చేశారు.
அரூர் அருகே பள்ளி சிறுவர்களை கை கால்களை அமுக்கி விட சொல்லும் தலைமை ஆசிரியை.. வீடியோ வைரலானதால் பொதுமக்கள் அதிர்ச்சி... அரூர் மாவட்ட கல்வி அலுவலர் நேரில் விசாரணை #Trending | #viralvideo | #tnschool | #headmaster | #updatenews360pic.twitter.com/DCM6bTsIcN
— UpdateNews360Tamil (@updatenewstamil) September 3, 2025