కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించేందుకు నాటి కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశాడని నిన్న కల్వకుంట్ల కవిత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా తాను హరీష్ రావు మీద విమర్శలు చేశానన్నారు. ఆరోజు తాను మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవమన్నారు.
తనది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నానని గుర్తు చేశారు. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో తాను తప్పు మాట్లాడానని అన్నారు. ఈ విషయాన్ని హరీష్ రావు దగ్గర కూడా చెప్పానన్నారు. మీరు చేసింది కరెక్ట్.. నేను చేసింది తప్పు అని ఆయన సమక్షంలో ఒప్పుకున్నట్లు చెప్పారు.
వైరల్ అవుతున్న వంటేరు పాత వీడియో ఇదే:
హరీష్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు..
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. హరీష్ రావు పెద్ద అవినీతి పరుడని.. కుట్రదారుడని ఆరోపణలు గుప్పించారు. 2009 ఎన్నికల్లో కేటీఆర్, 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి ఆయన కుట్ర చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ద్వారా దోచుకున్న డబ్బుతో 2018 ఎన్నికల్లో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ చేశారన్నారు. తమ కుటుంబం విచ్ఛిన్నం అయితే పార్టీని హస్తగతం చేసుకోవాలన్నది ఆయన కుట్ర అని ఆరోపించారు. కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లను మేనేజ్ చేస్తే హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తాడన్నారు. సీఎం రేవంత్ కాళ్లు పట్టుకుని తనపై కేసులు రాకుండా చూసుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కవిత. తనపై జరిగిన అనేక దుష్ప్రచారాల వెనుక ఉన్నది హరీష్ రావేనని అన్నారు. హరీష్ రావుతో కేటీఆర్, కేసీఆర్ కు కూడా ముప్పు పొంచి ఉందన్నారు.
KCRను ఓడించేందుకు హరీష్ డబ్బులు.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్!
కేసీఆర్ ను ఓడించడానికి 2018 ఎన్నికల్లో తనకు హరీష్ రావు ఫోన్ ఫోన్ చేశాడని గతంలో తాను చేసిన ఆరోపణలు పూర్తిగా అవస్తవమని ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చెప్పింది అబద్ధమన్నారు. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారన్నారు.