Telangana RTC: తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. రాఖీ పండగ వేళ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను 11వ తేదీ వరకు నడుస్తాయని తెలిపింది. ఈ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది

New Update
  TGSRTC Buses

TGSRTC Buses

రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 11వ తేదీ వరకు నడుస్తాయని తెలిపింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. దీనికి ఓ ముఖ్య కారణం ఉంది. చాలా ప్రాంతాల్లో బస్సులు లేవు. రాఖీ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ బస్సులు తీసుకురావాలి. దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా కేవలం స్పెషల్ బస్సులో ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. కేవలం మూడు రోజులు మాత్రమే అధిక ధరలు ఉంటాయని, ఆ తర్వాత ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

రద్దీగా బస్టాండులు

రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లులో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌, ఎంజీబీఎస్ బస్ స్టేషనల్‌లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు. రాఖీ పండుగ కావడంతో సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగి రద్దీ ఏర్పడింది. దీనికి తోడు వీకెండ్ కావడంతో ఎక్కడ చూసిన ప్రయాణికులే కనిపిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల వద్ద కూడా జనం బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని భావించారు. పండుగ రోజుల్లో ఈ రద్దీ సర్వసాధారణమే అయినా, పెరిగిన ఛార్జీలు ప్రయాణికులకు కొద్దిగా భారంగా మారాయి.

ఇది కూడా చూడండి: KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు