TGSRTC : మహాశివరాత్రికి బాదుడే.. తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత
మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.