RTC Workers: RTC ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే మహా లక్ష్మ పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగినందుకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
TGSRTC : మహాశివరాత్రికి బాదుడే.. తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత
మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Telangana RTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్
TG: ప్రయాణికులకు RTC తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. వచ్చే నెలలోపు HYD సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను అమలు చేయనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు స్మార్ట్ కార్డు ఇవ్వనుంది.
TSRTC Awards: ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డు..!!
టీఎస్ఆర్టీసీ అవార్డుల ప్రదానోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ జ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే TSRTC మోడల్ గా నిలిచిందని అన్నారు. మొత్తం 286 మందికి అవార్డులు అందజేశారు.
బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు
కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు
ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!
చలో రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.