తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.

New Update
CM Revanth

CM Revanth

పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుంది. ఉగాది సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఎన్నికల సమయంలో హామీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యాన్ని పంపినీ చేయనుంది.

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం..

ప్రతి రేషన్‌ కార్డుపై ఆరు కిలోల చొప్పున ఇస్తారు. ఒక కుటుంబంలో ఎందరు లబ్ధిదారులుంటే అంతమందికీ కూడ సన్నబియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో మొత్తం లక్షకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. అయితే కొత్త వాటితో కలుపుకుంటే ప్రస్తుతం 91.19 లక్షల రేషన్‌కార్డులు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.82 కోట్లు ఉంది.

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

మొత్తానికి 3.10 కోట్ల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా నెలకు 1.80 లక్షల టన్నుల వరకు బియ్యం అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి బియ్యం ఇస్తున్నాయి. వీటిని పేదలు మాత్రమే తింటున్నారు. మధ్య తరగతి వారు వీటిని బయట అమ్మేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

వీటినే వారు రీసైకిల్‌ చేసి హోటళ్లకు, టిఫిన్‌ సెంటర్లకు, దుకాణాలకు వెళ్తున్నాయి. దీనివల్ల అక్రమంగా కొందరు కోట్లు సంపాదిస్తు్న్నారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని అందరూ ప్రజలు వినియోగించుకునేలా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు