RS Praveen Kumar: చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి

ఫుడ్ పాయిజన్ కుట్ర కోసం మాఫియాను నడిపించాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ ఖండించాడు. చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరాడు. ఏ విచారణకైనా తాను సిద్ధమేని చెప్పాడు.

author-image
By srinivas
New Update
rereer

Food Poisoning : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తన హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ కుట్ర కోసం ప్రవీణ్ ఒక మాఫియాను నడిపించారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే తన మీద విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేని ప్రకటించాడు.

Also Read :  టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ

 కొండా సురేఖ చిల్లర మాటలు..

ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. తన విద్యార్థులు గురుకులాల్లోనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారని చెప్పారు. కొండా సురేఖ చిల్లర మాటలు ఆపాలని, ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం తాము రూ. 999 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు. ప్రభుత్వం చేతిలోనే నిఘా వ్యవస్థలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుకుంటే నేరుగా తన మీద విచారణ చేయించవచ్చని చెప్పారు. r

ఇది కూడా చదవండి: రోజాకు బిగ్ షాక్.. చెప్పుల లొల్లిలో కేసు నమోదు!?

ఇదిలా ఉంటే.. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లో తరచూ ఫుజ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలవగా చికిత్సపొందతూ ఓ విద్యార్థిని చనిపోవడం కలకలం రేపింది. ఫుజ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 

ఇది కూడా చదవండి: US: నా కొడుకు రాక్షసుడు.. మహిళలను వేధిస్తాడు: మంత్రి తల్లి ఆగ్రహం

Also Read :  రాజ్యసభకు మహేశ్ బాబు బావ.. చంద్రబాబు శుభవార్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు