/rtv/media/media_files/2025/01/20/z7w5Dt8NFapOzBSVud0H.jpg)
KTR Nalgonda Police
నల్లగొండలో రేపు కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. గతంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వేదికగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సరికాదని మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే రైతు ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ (KTR) అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) ట్వీట్ చేసింది. రైతుల పక్షాన పోరాడుతున్నందుకు ఎందుకిన్ని ఆంక్షలు? అని ప్రశ్నించింది. ప్రజా పాలనలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా? అంటూ ధ్వజమెత్తింది. అయితే.. ధర్నాకు అనుమతి లభించకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
Also Read : చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం!
బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ సర్కార్.
— BRS Party (@BRSparty) January 20, 2025
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్న రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ@KTRBRS అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయం?
రైతుల పక్షాన పోరాడుతున్నందుకు… pic.twitter.com/rqhGKGLrRn
Also Read : విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు చెప్పిన మెదక్ కలెక్టర్.. వీడియోలు వైరల్!
గతంలో ఓ సారి వాయిదా..
వాస్తవానికి ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా (Rythu Dharna) నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే.. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో వాయిదా వేసింది. పోలీసుల సూచనతోనే ఆ సమయంలో ధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. పండుగత తర్వాత ధర్నాను నిర్వహిస్తామని ప్రకటించింది. మళ్లీ ఈ నెల 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : సీఎం రేవంత్‌కు హైకమాండ్ కీలక బాధ్యతలు
Follow Us