/rtv/media/media_files/2025/01/19/qI6BKWWZHxPDZqZCjSPf.jpg)
చిత్తూరు జిల్లా పనబాకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐ10 కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో తమిళనాడుకి చెందిన వారు ప్రయాణిస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్దారించారు. కారులో ఒకరి పరిస్థితి విషమం, ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి:Sexual harassment: ఎంత పని చేశార్రా.. మైనర్ బాలుడిపై స్నేహితులు లైంగిక దాడి!
చిత్తూరు జిల్లా పనబాకం వద్ద రోడ్డు ప్రమాదం
— RTV (@RTVnewsnetwork) January 19, 2025
లారీని నేరుగా ఢీకొన్న కారు
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు దుర్మరణం
తమిళనాడుకి చెందిన ఐ10 కారుగా గుర్తింపు
ఒకరు పరిస్థితి విషమం, ఇద్దరికీ తీవ్ర గాయాలు#AndhraPradesh#Chittoor#RoadAccident#RTVpic.twitter.com/SPvOaEeWRi
తిరుమలలో బోల్తా పడ్డ కారు..
ఈ రోజు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోనూ ప్రమాదం చోటు చేసుకుంది. ఏడవ మైలు వద్ద డివైడర్ ఢీకొని కారు బోల్తా పడింది. రోడ్డుపై అయిల్ ఎక్కవగా ఉండటంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యింది. దీంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం స్కిడ్ అయి ఒకరికి గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని, ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొదటి ఘాట్ లో బైక్ పై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి:Nigeria: నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి!