విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు చెప్పిన మెదక్ కలెక్టర్.. వీడియోలు వైరల్!

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు బోధించారు. నిన్న చేగుంట మండలం వడియారం స్కూల్ పరిశీలనకు కలెక్టర్ వెళ్లారు. టెన్త్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి పరీక్షించారు. అనంతరం వారికి స్వయంగా పాఠాలు బోధించి సందేహాలు నివృత్తి చేశారు.

New Update
Telangana Medak Collector

Telangana Medak Collector

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలం వడియారం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు ఆయన వెళ్లారు. పదవ తరగతి విద్యార్థులకు టీచర్ గా మారి పాఠాలు బోధించారు. ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ క్రమంలో త్రికోణమితి (Trigonometry) కి సంబంధించిన ప్రశ్నలను అడిగారు. విద్యార్థులకు స్వయంగా త్రికోణమితిని బోధించారు. Sin, Cos, Tan అంటే ఏంటో విద్యార్థులకు వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు.. రూ.450 కోట్లతో ఐటీ పార్కు

అనంతరం భోజనశాలను, స్టోర్ రూమ్, సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అంటూ.. నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు సూపర్ సార్ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. గతంలోనూ శంకరంపేట మండల పరిషత్ స్కూల్ కు వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఓసారి ఆదివారం నాడు క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లి కూలీలతో కలిసి పని చేశారు కలెక్టర్. భార్య, తన ఇద్దరు పిల్లలతో సరదాగా పొలంలోకి వెళ్లి స్వయంగా నాట్లు వేశారు. 
ఇది కూడా చదవండి: Khammam: చుట్ట తాగుతూ నిద్రలోకి.. ఖమ్మంలో వృద్ధుడు సజీవ దహనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు